yesu raju rajula rajai

యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే -2
త్వరగ వచ్చుచుండే -2

హోసన్నా జయమే -2
హోసన్నా జయం మనకే -2
యేసురాజు రాజులరాజై – త్వరగా వచ్చుచుండే

1. యోర్దాను ఎదురైనా – ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
భయము లేదు జయము మనదే
విజయ గీతము పాడెదము

2. శరీర రోగమైనా – అది ఆత్మీయ వ్యాధియైనా -2
యేసు గాయముల్ స్వస్థపరచును -2
రక్తమే రక్షణ నిచ్చున్ -2

3. హల్లెలూయ స్తుతి మహిమ – ఎల్లప్పుడు
హల్లెలూయ స్తుతి మహిమ -2
యేసురాజు మనకు ప్రభువై – త్వరగా వచ్చుచుండె