Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

aagipodhu na pata

ఆగిపోదు నా పాట – గమ్యం చేరేదాక
సాగుతుంది ప్రతిపూట – నా పరుగు ముగిసేదాక
1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను
అలసటతో జోగినా శృతి తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
2. నా అడుగు జారినా కలవరము చెందను
నా బలము పోయినా లయ తగ్గనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును

3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను
మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను
ఎదురైన అవరోధం యేసే తొలగించును
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును