భరియించలేనయ్యా నీ మౌనము
సహియించలేనయ్యా ఈ భారము
ఊహించలేనయ్యా ఈ దూరము
మన్నించు యేసయ్యానా పాపము
నీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి
అంతా మాయేకదా ఈ పాడు లోకము
నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా ఈ గాయము
నిరాశ నిసృహలో నలిగిపోతిని
నీ మాట కాదని దూరమైతిని
నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా
నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా
విడువని బంధమేగా ఆ కలువరి యాగము.
నను వీడి పోవనేగా ఈ మౌనగీతము.

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.