chatali jagatilo devuni keerthi

చాటాలి జగతిలో దేవుని కీర్తి కావాలి మనిషికి దేవుని నీతి
మనుష్యుడా ఏది ఉత్తమమో ఇకనైనా నీవు తెలుసుకో

లోక స్నేహమైనా అంద చందమైనా
కలకాలము కలిసి రావు నీకు తోడుగా
మేడ మిద్దెలైన పరువు ప్రతిష్ఠయినా
చేకూర్చవు మేలులు నీకు ఎల్లవేళలా
బ్రతుకుకు కావాలి శ్రేష్టమైనది బ్రతుకులు సాధించాలి నిత్యమైనవి
మనుష్యుడా

లోక జ్ఞానమైనా సకల శాస్త్రమైనా
నిత్య జీవ మార్గము నీకు చూపలేవుగా
మనుష్య నీతి అయినా బలులర్పనలైనా
శాశ్వత రాజ్యములో నిన్ను చేర్చలేవుగా
క్రీస్తు మాటలే జీవమైనవి దేవునికై బ్రతుకుటయే శ్రేష్టమైనది
క్రీస్తు మార్గమే జీవమైనది దేవునికై బ్రతుకుటయే శ్రేష్టమైనది

మనుష్యుడా