కనులున్నా కానలేని చెవులున్నా వినలేని ||2||
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని ||2||
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను ||2|| ||కనులున్నా||
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా ||2||
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును ||2|| ||కనులున్నా||
భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా ||2||
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని ||2|| ||కనులున్నా||
బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా ||2||
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని ||2|| ||కనులున్నా||

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.