మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు 2
ఆది ఆంతమయిన వాడవు మానవుని రూపమెత్తావు 2
పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి 2
ఎంతగా స్తుతులు పాడిన యేసు నీ ఋణము తీరునా 2

1. లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు
నీ దెంత దీన మనసు నా కెంత ఘనత యేసు

2. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు
నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం