క్రీస్తేసు ప్రభువు Telugu Christian Songs Lyrics

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది (2) ||క్రీస్తేసు||

అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే (2)
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు||

పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో (2)
వారే పొందెదరు క్షేమాభివృద్ధి
క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు||

ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే
తన యందు నిలిచెదరు (2)
ప్రకటించెదరు ఆయన మరణ
పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు||

పట్టు వదలక సంఘముతో కూడి
ఎవరు ప్రార్ధించెదరో (2)
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు
బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు||

క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు
ఎవరెదురు చూచెదరో (2)
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు
సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||

క్రీస్తేసు ప్రభువు Jesus Songs Lyrics in Telugu


క్రీస్తేసు ప్రభువు Telugu Christian Songs Lyrics