క్షణమైన నీవు Telugu Christian Songs Lyrics

క్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)
కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన||

పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||

శోధనలు నన్ను చుట్టుముట్టినా
శ్రమలే నన్ను కృంగదీసినా (2)
నా తండ్రివై నా తోడుగా నిలచి
నా భారములన్ని తొలగించితివే (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||

క్షణమైన నీవు Jesus Songs Lyrics in Telugu


క్షణమైన నీవు Telugu Christian Songs Lyrics