Sara Sarpamura

సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా
విస్కీ విషమురా అది ప్రాణం తీయక ఒప్పదురా
చావు గోతిని తవ్వుకోకురా ఆ..ఆ..ఆ..
చావు గోతిని తవ్వుకోకురా నిన్ను నీవే చంపుకోకురా
చావు గోతిని తవ్వుకోకురా పైకి పోకముందే దేవుని నమ్ముకోరా

తాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలు
కష్టార్జితము పరుల పాలు కన్న పిల్లలు కన్నీటి పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ. (2)
ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు

పరువు కాస్తాబజారు పాలు అరువు కరువు రోదన పాలు
తనువు కాస్తారోగాల పాలు బ్రతుకు చితుకు కాష్టము పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ..ఆ..ఆ… (2)
ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు