యేసు ప్రేమనే చూపిద్దాం. యేసు లాగనే జీవిద్దాం
లోకాన్నే మార్చుద్దాం. చలో.
యేసు వార్తనే చాటేద్దాం నశించు ఆత్మను మార్చేద్దాం
యేసు సువార్తను ప్రకటిద్దాం. బోలో.
యేసయ్య సాక్షిగా జీవించుదాం తన చిత్తం నెరవేర్చుదాం (2)
యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం.(2)

యేసయ్యనామం ముక్తికి మార్గం యేసయ్య సన్నిధి సంతోషం
యేసయ్య వాక్యం జీవాహారం యేసయ్యే మనకు ఆధారం

యేసయ్య చరణం పాపికి శరణం యేసయ్య చిత్తం చిరజీవం
యేసయ్యే మార్గం సత్యం జీవం యేసయ్య వలనే పరలోకం
యేసయ్య రాకకు సిద్ధపడుదాం ఆత్మలను సిద్ధపరచుదాం (2)
యేసే రారాజని సర్వలోకానికి ఎలుగెత్తి చాటించుదాం (2)