యూదా రాజ సింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిన్ గెలిచి లేచెను
1. నరక శక్తులన్ని ఓడిపోయెను
ఓడిపోయెను – ఆవి వాడి పోయెను
2. దూత సైన్యమంత – స్తుతించు చుండ
స్తుతించు చుండ – యేసుని సన్నుతించుచుండ
3. మరణ సంకెళ్ళను – త్రెంచి వేసెను
త్రెంచి వేసెను – వాటిన్ వంచి వేసెను
4. యేసు లేచెనని – మ్రోగుచున్నది
మ్రోగుచున్నది – భయమున్ ద్రోలుచున్నది
5. వనితల్ దూత వార్త – విశ్వసించిరి
విశ్వసించిరి – మదిన్ సంతసించిరి
6.పునరుద్ధానుడెన్నడు – మరణించడు
మరణించడు – మరణించడెన్నడు
7. యేసూ! నీదు పాదం – మ్రొక్కెదము
మ్రొక్కెదము – మము ముద్రించుము
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.