ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా||
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే (2)
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను (2) ||ఆహా||
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ (2)
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి (2) ||ఆహా||
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని (2)
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా||
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో (2)
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే (2) ||ఆహా||