అల్ఫా ఒమేగ అయిన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా
పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా

తేజోమయుడా నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుచుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగ నను చేసెను
నా స్తుతి కీర్తన నీవే – స్తుతి ఆరాధన నీకే !!అల్ఫా ఒమేగ!!

నిజస్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా – నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను
నా చెలిమి నీతోనేె – నా కలమి నీలోనేె !!అల్ఫా ఒమేగ!!

Read more: http://teluguonefaith.blogspot.com/2015/03/alpha-omega-hosanna-ministries-2015.html#ixzz4uVxnklX6