భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు (2)
భయము చెందకు నీవు జయము దయచేయువాడు (2)
దేవుడేహొవా ఉన్నాడు మన సాయంనకు దేవుడేసయ్యా ఉన్నాడు (2)

1. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున (2)
పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే (2)
నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా (2)

2. చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన (2)
పాడి కీర్తించి పౌలు సీలల్ కొనియాడె (2)
భూకంపం కలగలేదా ఓ భక్తుడా భూకంపం కలగలేదా (2)

3. ఆస్తియంతా పోయినా తన దేహమంతా కుర్పులతో నిండిన (2)
అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకు పోయే (2)
అని యోబు పల్కలేదా ఓ భక్తుడా అని యోబు పల్కలేదా (2)