భూపునాది మునుపే Telugu Christian Songs Lyrics

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము ||భూపునాది||

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును (2)
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును ||భూపునాది||

వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును ||భూపునాది||

భూపునాది మునుపే Jesus Songs Lyrics in Telugu


భూపునాది మునుపే Telugu Christian Songs Lyrics