బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా

చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో ఏసయ్యా దరి చేర్చుమో నన్నయా
బ్రతికించుమో ఏసయ్యా…… దరి చేర్చుమో నన్నయా

కాపరి లేని గొర్రేనయితి కాటికి నే చేరువయితి
కావాలి లేని తోటనయితి కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనయితి గుండె పగిలిన ఏకాకినయితి
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో ఏసయ్యా
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా
నా ఆశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం
శోధనలా సుడివడిలో తొట్రిల్లేనే నా పయనం
చుక్కాని లేని నావనయితి గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో ఏసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా……..
గురి చేర్చుమో ఏసయ్యా….నా గుండె గుడిలో నీవుండయ్యా……..