brathukuta nee kosame maranamaithe

బ్రతుకుట నీ కోసమే
మరణమైతే నాకిక మేలు (2)
సిలువ వేయబడినానయ్యా (2)
నీవే నాలో జీవించుమయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)

ఏ క్షణమైనా ఏ దినమైనా
నీ కొరకే నే జీవించెద (2)
శ్రమలైనా శోధనలైనా
ఇరుకులైనా ఇబ్బందులైనా (2)
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2)
సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా||

లోకములోని నిందలు నాపై
రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)
రాజులైనా అధిపతులైనా
ఉన్నవి అయినా రాబోవువైనా (2)
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)
ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||