Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

brathakalani unna

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య

కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి
కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి
గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)

నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం
చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)