కల్వరి స్వరము నీ కొరకే
సుమధుర స్వరము మన కొరకే
మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము 2
సా. గరిగ సానీ.. పా. మా గమపా. 2
సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము
శాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరము
ఆశల అలలో నిరాశల వలలో 2
చిక్కిన వారికి కల్వరి స్వరము
చిక్కిన వారికి ప్రభునీ స్వరము
గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరము
చితికిన బ్రతుకును పగిలిన గుండెను ఆదరించును ప్రియుని స్వరము
దాహముగొనినా వారలకెల్లా. 2
సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును ప్రభునీ స్వరము
మార్పును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరము
పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికి కల్వరి స్వరము
వేడిగ లేక చల్లగ లేక…… 2
నులివెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరము

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.