దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)
కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని||
దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||