Enaleni prema lyrics song

Listen Enaleni prema lyrics song


Enaleni prema lyrics song

Enaleni prema lyrics

ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా (2)

నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని||

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||