గత కాలమంత Telugu Christian Songs Lyrics

గత కాలమంత నిను కాచిన దేవుడు
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను
ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి
ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి

మట్టి కుండగా పుట్టించి నిన్ను
కంటి పాపగా కాపాడినాడు (2)
అందాలాలెన్నో ఎక్కించువాడు
అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి||

యేసుని హత్తుకో ఈ లోకమందు
ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2)
తలను ఎత్తుకొని పైకెత్తి చూడు
మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి||

కష్టాలలో నిన్ను కాపాడినాడు
నష్టాలలో నిన్ను కాపాడినాడు (2)
నీవు నమ్ముకుంటే నిను వదులలేడు
నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||

గత కాలమంత Jesus Songs Lyrics in Telugu


గత కాలమంత Telugu Christian Songs Lyrics