Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

జాగ్రత్త భక్తులారా Telugu Christian Songs Lyrics

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును
వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును
వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము

చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా
విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త||

గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము
లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త||

మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి
ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త||

దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురు
మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు ||జాగ్రత్త||

క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు
ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు ||జాగ్రత్త||

జాగ్రత్త భక్తులారా Jesus Songs Lyrics in Telugu


జాగ్రత్త భక్తులారా Telugu Christian Songs Lyrics