kanaleni kanulelanayya

కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా ఏసయ్యా

1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా

2. దాహము గొన్న ఓ ఏసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా

౩. మరణించావు ఏసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా

4. రాజ్యమును విడిచిన ఏసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా

5. అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్న
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా