laali laali – (Andhra christava keerthanalu)

లాలి లాలి లాలి లాలమ్మ లాలీ
లాలియని పాడరే బాలయేసునకు

1. పరలోక దేవుని తనయుడో యమ్మా
పుడమిపై బాలుడుగ బుట్టెనో యమ్మా

2. ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ
మహి పాలనము జేయు మహితుడో యమ్మా

3. ఆద్యంతములు లేని దేవుడో యమ్మా
ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా

4. యూదులకు రాజుగాబుట్టెనో యమ్మా
యూదు లాతని తోడ వాదించి రమ్మా

5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా
గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా