మానవుడవై సకల Telugu Christian Songs Lyrics

మానవుడవై సకల నరుల
మానక నా దోషముల
బాపుటకు బలియైతివే యేసు – (2)
బహు ప్రేమ తోడ ||మానవుడవై||

నీదు బలిని నిత్యముగను
నిజముగా ధ్యానించి ప్రేమను
నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2)
నియమంబు నిచ్చి ||మానవుడవై||

నీ శరీరము రొట్టె వలెనె
నిజముగా విరువంగబడెనే
నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2)
నా యన్న యేసు ||మానవుడవై||

మంచి యూట మించి దండి
పంచ గాయములలో నుండి
నిత్య జీవపు టూటలు జేసితి – (2)
నీ ప్రేమ నుండి ||మానవుడవై||

నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు
నీదు ప్రేమ బలిలో మనుటకు
నిత్య మాచరించుడంటివి నీ – (2)
నిజ భక్తి తోడ ||మానవుడవై||

ఎంతో ప్రేమతో బలిగానయితివి
యెంతో ప్రేమాచారమైతివి
చింతలును నా పాపములు బాప – (2)
శ్రీ యేసు దేవా ||మానవుడవై||

నిత్య బలియగు నిన్నే నమ్మి
నిన్ను ననుభవించి నెమ్మి
నిన్ను నిముడించుకొని నాలో నీ – (2)
నిజ రూప మొంద ||మానవుడవై||

నేను నీ బలిలోన గలిసి
నేను నీతో గలిసి మెలిసి
నేను నీవలె నుండి జేసితివే – (2)
నా దివ్య యేసు ||మానవుడవై||

నీదు శ్రమలను బలిని నిపుడు
నాదు కనులు చూడ నెపుడు
నాదు పాప భారములు దిగునే – (2)
నా దివ్య యేసు ||మానవుడవై||

నీవు బలియై తిరిగి లేచి
నిత్య తేజోరూపు దాల్చి
నిత్యమును నా బంతి నున్నావే – (2)
నిజ దేవా యేసు ||మానవుడవై||

నీవే నీ చేతులలో నిత్తువు
ఈ నీ బలి విందునకు వత్తువు
నిన్ను నిట జూచితిని నా యేసు – (2)
ఎన్నడును మరువను ||మానవుడవై||

మానవుడవై సకల Jesus Songs Lyrics in Telugu


మానవుడవై సకల Telugu Christian Songs Lyrics