Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

మేఘాల పైన మన యేసు Telugu Christian Songs Lyrics

మేఘాల పైన మన యేసు
త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2)
సిద్ధపడుమా ఉల్లసించుమా
నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల||

ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు
బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2)
బూర శబ్దం మ్రోగగా
ప్రభుని రాకడ వచ్చును
రెప్ప పాటున పరిశుద్ధులు
కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల||

పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా
దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2)
వినుట వలన విశ్వాసం
కలుగును సోదరా
దేవుని ఆజ్ఞకు లోబడితే
పొందెదవు పరలోకం ||మేఘాల||

స్తుతియు మహిమ ఘనత ప్రభావం
యేసుకే చెల్లు గాక
తర తరములకు యుగయుగములు
యేసే మారని దైవం (2)
నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట
నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||

మేఘాల పైన మన యేసు Jesus Songs Lyrics in Telugu


మేఘాల పైన మన యేసు Telugu Christian Songs Lyrics