మొదట నీ స్థితి కొంచెమే అయినను
తుదకు నీవు మహాభివృద్ది నొందెదవు
నీ ప్రయాస ప్రభువు నందు
వ్యర్ధము కాదులే మనతో ప్రభువుండగా

జాగ్రత్తగా నీవు దేవుని వెదకిన
సర్వశక్తుని నీవు బ్రతిమాలుకొనిన
నిశ్చయం నీ యందు శ్రద్దను నిలిపి
వర్ధిల్లజేయును నీ నివాసము

యెహోషువా చేత పంపబడినవారు
పాపము లేని వారై తిరిగి వచ్చినారు
రక్షణ ద్వారము తెరచి విజయంబు నిచ్చి
సేవకుని మాట స్థిరపరిచినావు

యోర్దాను నీళ్ళు ఏకరాసి ఆయనే
కటినమైన పరిస్థితులు బ్రద్దలై పోయెనే
నా అడుగులు స్థిరపరిచి కార్యము సఫలము చేసి
సేవకుని మాట నెరవేర్చినావు