నా యేసయ్య ప్రేమ Telugu Christian Songs Lyrics

నా యేసయ్య ప్రేమ
నా తండ్రి గొప్ప ప్రేమ(2)
వర్ణించగలనా నా మాటతో
నే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య||

నా పాపనిమిత్తమై
సిలువనూ తానే మోసే
ఈ ఘోర పాపి కొరకై
తన ప్రాణము అర్పించెనే (2)
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే(2) ||నా యేసయ్య||

తప్పి పోయిన నన్ను
వెదకి రక్షించితివే
ఏ దారి లేక ఉన్నా
నీ దరికి చేర్చితివే (2)
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య||

నా యేసయ్య ప్రేమ Jesus Songs Lyrics in Telugu


నా యేసయ్య ప్రేమ Telugu Christian Songs Lyrics