నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2)
నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2)
మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా. (2)

ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా (2)
నిందలో అపనిందలో నాకు తోడునీడగా (2)
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా మనసా నీకేలా (2)

వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా (2)
మరణమై బలియాగమై నన్ను విడిపించినా (2)
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా మనసా నీకేలా (2)

మార్గమై నా గమ్యమై నన్ను నడిపించినా (2)
ఓర్పుయై ఓదార్పుయై నన్నాదరించినా (2)
నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా (2)
భయమా దిగులా మనసా నీకేలా (2)