నిన్న నేడు నిరంతరం Telugu Christian Songs Lyrics

నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2)

యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)
విడువదే నన్నెల్లప్పుడూ కృప
విజయపథమున నడిపించెనే కృప (2)
విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న||

యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవముకై (2)
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించేనే కృప (2)
మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న||

యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)
ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప (2)
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న||

నిన్న నేడు నిరంతరం Jesus Songs Lyrics in Telugu


నిన్న నేడు నిరంతరం Telugu Christian Songs Lyrics