రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
గురి నిలిపి పయనిస్తున్నావా
రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు
అన్నట్టు జీవిస్తున్నావా (2)
యేసే లేని నీ బ్రతుకులో
వెలుగే లేదని తెలుసుకో
యేసే లేని జీవితానికి
విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన||
మంటితోనే నిను చేసినా
కంటి పాపగా కాపాడెనే
మాటి మాటికి పడిపోయినా
శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)
ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని
ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా
యేసే లేనిదే – పరలోకానికి
ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే||
యేసులోనే నీ రక్షణ
యేసులోనే నిరీక్షణ
యేసులోనే క్షమాపణ
చేసుకో మరి ప్రక్షాళన (2)
ఎంతో ప్రేమను – నీపై చూపించెను
తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా
ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ
ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే||