Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Sainyamulaku Adhipathi Song Lyrics | సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి

Sainyamulaku adhipathi song lyrics in telugu

పల్లవి :-
సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి
నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి

ప్రియమైన దేవా యేసయ్య
నీకే నా స్తోత్రము
ఘనమైన రాజా యేసయ్య
నీకే నా వందనం (2)
నీకే నా స్తోత్రము – నీకే నా వందనం
నీ వాక్యమే ఇల నా జ్ఞానము
నీ రక్తమే ఇల నా జీవము (2)

చరణం :- 1
నా పక్షమును నీవు వహించి
మూర్ఖుల నోరు మూయించినావు (2)
వీరుడవై నీవు నాకుండగా
నేనేల భయపడుదును
నాకింక దిగులేలను (2)
(సైన్యములకు అధిపతి)

చరణం :- 2
పరిశుద్ధాత్మలో పరవశించి
ప్రస్తుతించి నే పాడెదను (2)
విశ్వాసముతో విజయాలను
నిత్యము నే పొందిద
నీతోనే నిలిచేద (2)
(సైన్యములకు అధిపతి)


చరణం :- 3
పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి
నీ పరిచర్యను జరిగించెదను (2)
దీనుడనై నేను నీయందే
అతిశయించెదను – ఆనందించెను (2)
(సైన్యములకు అధిపతి)


Sainyamulaku Adhipathi Song Lyrics | సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి