సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా
శౌర్యముగల బలమైన యెహెూవా నీకే ఘనతయ్యా
స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను
స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను
నీకే మహిమ. నీకే ఘనత. యుగయుగముల వరకు….

శత్రువులే నన్ను చుట్టుముట్టగా
వేటగాడు నాపై గురిపెట్టగా
నీవే నీవే నా పక్షముగా పోరాడితివే
నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే.
నా బలము నాకేడెము నీవే యేసయ్యా
నా శైలము నా శృంగము నీవే యేసయ్యా

నా ప్రక్కన వేయిమంది పడియున్నను
పదివేలమంది పొంచియున్నను
పరాక్రమశాలిగ నా పక్షమే పోరాడితివే
ప్రధాన కాపరిగా నిలిచి నన్నే విడిపించితివే
నా దుర్గము నా గానము నీవే యేసయ్యా
నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా