రమ్యమైనది నీ మందిరము
సౌందర్యమైనది నీ ఆలయము (2)
అద్భుతమైనది నీ (నా) పరలోకము
బహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము (2)

అ:ప రమ్యమైనది బహు శ్రేష్టమైనది

నా యింటివారితో నీ సన్నిధిని చేరెదన్
నా పూర్ణహృదయముతో నే నిన్ను సేవింతును
నీ వాక్యముచేత నన్ను నింపుమయ్యా
నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా

నీ ఆత్మ శక్తితో నీ సాక్షిగా సాగెదన్
నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును (2)
నీ కోసమే ఇలలో నే జీవింతును
నశియించువారిని నీ సన్నిధికి చేర్చెదన్ (2)