సూడ సక్కని బాలుడమ్మో Telugu Christian Songs Lyrics

సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు (2) ||సూడ||

బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2) ||సూడ||

మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2) ||సూడ||

సూడ సక్కని బాలుడమ్మో Jesus Songs Lyrics in Telugu


సూడ సక్కని బాలుడమ్మో Telugu Christian Songs Lyrics