సుగుణాల సంపన్నుడా – స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో – ఆస్వాదింతును నీ మాటల మకరందము
1. యేసయ్య నీతో జీవించగానే – నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము – ఇది రక్షణానంద భాగ్యమే “సుగుణాల”
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే – ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు – నేను నడువ వలసిన త్రోవలో “సుగుణాల”
3. యేసయ్య నీ కృప తలంచగానే – నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట – ఇవి ఎన్న తగినవి కావే “సుగుణాల”
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.