తెలియక వారు సిలువ వేశారు
క్షమించమని ప్రార్థించాడు యేసు (2)
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు
తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు
వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేదెవరు ?
పదవి కోసము ప్రభువు యేసును
అమ్ముకొంటారా ఓటు నోటుకు ?
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు ?
దేవుని పాలన మనిషి పాలనగా మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా మారితే కూలి కాలిపోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేది ఎవరు ?
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.