ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు

జక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్య
లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య
ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య
కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య.
నీలాంటి వాడు లేనే లేడయ్య

నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్య
శత్రువును గెలిచిన బహు శూరుడవయ్య
సాతానును తొక్కిన జయశీలుడు నీవేనయ్య
మరణము గెలిచిన పునరుత్థానుడవయ్య
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య
నీలాంటి వాడు లేనే లేడయ్య