ఆశ్రయుడా నా అభిషిక్తుడా Telugu Christian Songs Lyrics

ఆశ్రయుడా నా అభిషిక్తుడా
నీ అభీష్టము చేత నను నడుపుచుండిన
అద్భుత నా నాయకా
యేసయ్య అద్భుత నా నాయకా

స్తోత్రములు నీకే స్తోత్రములు (2)
తేజోమయుడయిన ఆరాధ్యుడా (2)

నీ ఆలోచనలు అతి గంభీరములు
అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే (2)
శాంతి జలములే సీయోను త్రోవలు (2)

నీతి మార్గములో నన్ను నడుపుచుండగా
సూర్యుని వలె నే తేజరిల్లెదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2)
జీవించెదను నీ సముఖములో (2)

సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను (2)
భళా మంచి దాసుడనై నీ సేవలో (2)

ఆశ్రయుడా నా అభిషిక్తుడా Jesus Songs Lyrics in Telugu


ఆశ్రయుడా నా అభిషిక్తుడా Telugu Christian Songs Lyrics