ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోతివా చింతతో సమాధికి
వాదమాడి.. పంతమాడి (2)
అంతలోనే కన్ను మూసి పోతివా (2)
ధనము ధాన్యము కూడబెట్టి
మేడ మిద్దెలు కట్టబెట్టి (2)
అంత విడచి ఒంటిగానే పోతివా
ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2) ||ఎంత||
కొండలాంటి అండ బలమును
చూచి ఎంతో అదిరి పడితిని(2)
కండ బలము కరిగిపోయే
నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2) ||ఎంత||