ఇశ్రాయేలు రాజువే Telugu Christian Songs Lyrics

ఇశ్రాయేలు రాజువే
నా దేవా నా కర్తవే
నే నిన్ను కీర్తింతును
మేలులన్ తలంచుచు (2)

యేసయ్యా… యేసయ్యా… (2)
వందనం యేసు నాథా
నీ గొప్ప మేలులకై
వందనం యేసు నాథా
నీ గొప్ప ప్రేమకై

ఎన్నెన్నో శ్రమలలో
నీ చేతితో నన్నెత్తి
ముందుకు సాగుటకు
బలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా||

ఏమివ్వగలను నేను
విరిగి నలిగిన మనస్సునే
రక్షణలో సాగెదను
నా జీవితాంతము (2) ||యేసయ్యా||

ఇశ్రాయేలు రాజువే Jesus Songs Lyrics in Telugu


ఇశ్రాయేలు రాజువే Telugu Christian Songs Lyrics