jaya jaya yesu

జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
జయ జయ రాజూ జయ రాజూ జయ జయ స్తోత్రం జయ స్తోత్రం

1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను జయయేసు
పరమబలమొసగు జయయేసు శరణము నీవే జయయేసు

2. సమాధిగెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు
సమరము గెల్చిన జయయేసు అమరమూర్తివి జయయేసు

౩. బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు
బండలు దీయుము జయయేసు అండకుచేర్చుము జయయేసు

4. ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు
ముద్రను దీయుము జయయేసు ముద్రించుము నను జయయేసు

5. కావలిన్ గెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు
సేవలో బలము జయయేసు జీవము నీవే జయయేసు

6. సాతానున్ గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు
పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు