Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

madhuram amaram nee prema

మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణ
అగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిది
రక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ

1. నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగా
నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివే
నీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను నన్ను ఫలియింపజేయుచున్నది
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును

2. నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ కన్న
ఈ లోక సౌఖ్యాలకన్న ఎంతో శ్రేష్ఠమైనది
ఆ ప్రియమైన ప్రేమతో జీవింపజేయుచు నన్ను నడిపించుచున్నావయ్యా
నా కీర్తన నా జీవితం నా సర్వము నీకే ఎల్లవేళలలో నేను చెల్లింతును