నాకు జీవమై ఉన్న Telugu Christian Songs Lyrics

నాకు జీవమై ఉన్న నా జీవమా
నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా
నాకు బలమై ఉన్న నా బలమా
నాకు సర్వమై ఉన్న నా సర్వమా
నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా
నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై||

పూజ్యుడవు… ఉన్నత దేవుడవు
యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2)
నా ఆరాధన నా ఆలాపన
నా స్తుతి కీర్తన నీవే
నా ఆలోచన నా ఆకర్షణ
నా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై||

నాయకుడా… నా మంచి స్నేహితుడా
రక్షకుడా… నా ప్రాణ నాథుడా (2)
నా ఆనందము నా ఆలంబన
నా అతిశయము నీవే
నా ఆదరణ నా ఆశ్రయము
నా పోషకుడవు నీవే ||నాకు జీవమై||

నాకు జీవమై ఉన్న Jesus Songs Lyrics in Telugu


నాకు జీవమై ఉన్న Telugu Christian Songs Lyrics