Neeve neeve song lyrics in telugu
నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన
నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య
చరణం :- 1
శాశ్వతమైన నీ తొలి ప్రేమ
మార్గము చూపీ కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే
నీ చరణములే శరణమయ
నిను పోలి ఇలలోన
ఒకరైన కనరారే
నివు లేని బ్రతుకంతా
యుగమైనా క్షయమేగా
విలువైన వరమేగా
నివు చూపే అనురాగం
కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే
నీ ప్రియ స్నేహం – ఆనందం
కొలుతుము నిన్నే ఆద్యంతం
( నీవే నీవే )
చరణం :- 2
ఊహకు మించిన నీ ఘన కార్యం
ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా
జీవనదాత యేసయ్య
కలనైనా అలలైనా
వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా
కడదాకా నడిచావు
ఇహమందు పరమందు
కొలువైన ప్రభు యేసు
ఎనలేని దయ చూపే – బలమైన నామమే
నీ ఘన నామం – మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం
( నీవే నీవే )