పరలోకమును చూడాలిరో,
పసుల పాకలో ప్రసవించేనురో
ప్రభుయేసును చూడాలిరో
పసుల తొట్టెలో పవళించేనురో
ఎంత అద్భుతమో దేవుడే
దీనుడై దిగి వచ్చేనురో

కాలము పరిపూర్ణమాయేనురో
దేవుడు తన కుమారుని పంపేనురో
పాపము పరిపక్వమాయేనురో
పాపముకు ప్రాయశ్ఛిత్తము చేసేనురో
మనిషికి రక్షణను తెచ్చేనురో
లోక రక్షకుడై నిలిచేనురో

దీనులను పైకి లేవనెత్తేనురో
ప్రజల పెద్దలతో కూర్చోబెట్టేనురో
దైవ మానవ, సమ సమాజములో
దేవుని రాజ్యము స్థాపించేరో
పేదలు ప్రభువులు కలవాలిరో
క్రిస్మస్ పండుగ చేయాలిరో