prabhuva ninu keerthinchutaku

ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్ళ చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా.
ఎంతగ నిను కీర్తించినను యేమేమి అర్పించినను
ఎంతగ నిన్ను కీర్తించినను యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా

కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి
ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా ….. నే తగుదునా…..
వింతగ నను దీవించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా….

నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి
ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా… నే తగుదునా…
వింతగ నన్ను హెచ్చించుటకు నేనర్హుడనా. నేనర్హుడనా…..