Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

priya Yesu Nirminchithivi Priyamaara Naa Hrudayam

ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
మృదమార వసియించునా
హృదయాంతరంగమున
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి
అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే
చేరితి నీదు దారి
కోరి నడిపించుము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా