sthiti Bneeke yesu raaja

స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా (2)
స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా
హెూసన్నా. హెూసన్నా.. హల్లెలూయా హెూసన్నా. (2)
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు (యేసు) (2)

మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్దుల విందులో పాలు నొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము

సంతోష గానాలతో ఉత్సహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైన శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము

పరిశుద్ధ హృదయముతో పరవశించి పాడెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము (మేము) (2)
యేసు ఒక్కడే దేవాధి దేవుడని (2)
ఎలుగెత్తి మేము చాటెదము